అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ప్రమాణం చేస్తున్నా.. తెలంగాణలో అధికారంలోకి రాగానే మొట్టమొదట చేసే పని ఇదే: బండి సంజయ్

  • తెలంగాణలో అతి పెద్ద అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం
  • కేసీఆర్ ఈ పని చేయలేకపోతున్నారు కాబట్టి బీజేపీ చేస్తుంది
  • తెలంగాణలో నియంత పాలన
  • అందుకే అంబేద్కర్ విగ్రహం గురించి కేసీఆర్ పట్టించుకోవట్లేదు 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్‌లోని పీవీ ఘాట్‌ను సందర్శించుకున్న అనంతరం ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి నివాళులర్పించారు. అలాగే, అంబేదర్క్ విగ్రహం వద్ద కూడా నివాళులు అర్పించి ఈ సందర్భంగా మరోసారి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘తెలంగాణలో నియంత పాలన కొనసాగుతోంది కాబట్టి కనీసం అంబేద్కర్ విగ్రహాల వద్ద అలంకరణ చేయాలన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవట్లేదు. మేము తెలంగాణలో అతి పెద్ద అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. కేసీఆర్ ఈ పని చేయలేకపోతున్నారు కాబట్టి బీజేపీ చేస్తుంది.

బీజేపీ 2023లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట చేసే పని దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని భాగ్యనగరంలో ఏర్పాటు చేయడమే. అంబేద్కర్ విగ్రహం ముందు, ఆయన సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. అంబేద్కర్ విగ్రహంపై అప్పట్లో కేసీఆర్ ఇచ్చిన మాట తప్పారు. ఈ విషయాన్ని కేసీఆర్‌కు గుర్తు చేస్తున్నాను’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.


More Telugu News