స్థల ప్రభావంతోనే అక్బరుద్దీన్ ఒవైసీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు: విజయశాంతి చురక

  • పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్‌లను కూల్చాలని అక్బరుద్దీన్ అన్నారు
  • ఎర్రగడ్డలో మాట్లాడారు కాబట్టి అలాంటి వ్యాఖ్యలు చేశారు
  • అలాగైతే మరి కొందరు ప్రజలు మరిన్ని డిమాండ్లు చేస్తారు
  • ట్రాఫిక్‌కు అడ్డంగా ఉందని చార్మినార్‌ను కూల్చమంటారు
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ముగియడానికి సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత కాక రేపుతోంది. రాజకీయ నాయకులు ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతున్నారు. పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్‌లను కూల్చాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ వ్యాఖ్యలు చేయడం పట్ల చెలరేగుతోన్న అలజడిపై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి స్పందించారు.

అక్బరుద్దీన్ ఒవైసీ జీ ఆక్రమణల పేరుతో పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్‌లను కూల్చాలని డిమాండ్ చేస్తే, మరి కొందరు ప్రజలు ఎఫ్‌టీఎల్ వాటర్ సమస్యలో ఉంది కాబట్టి తాజ్‌మహల్‌ని కూల్చమని అనవచ్చని అన్నారు. ట్రాఫిక్‌కు అడ్డంగా ఉంది కనుక చార్మినార్‌ను కూల్చాలని కూడా అనవచ్చని చెప్పారు. ఈ విధమైన ప్రకటనలు అక్బరుద్దీన్ ఒవైసీ జీ ఎర్రగడ్డ ప్రాంతంలో మాట్లాడినప్పుడు చేసినందువల్ల స్థల ప్రభావంగా భావించి పెద్దగా స్పందించనవసరం లేదని అభిప్రాయపడుతున్నానని ఆమె చురకలంటించారు.


More Telugu News