దేశ వ్యాప్తంగా మొదలైన సార్వత్రిక సమ్మె... మద్దతు పలికిన టీఆర్ఎస్!

  • సమ్మెలో భాగమైన 25 కోట్ల మంది
  • బ్యాంకింగ్ సేవలకు అంతరాయం
  • కేంద్ర సంస్థల ప్రైవేటీకరణను అంగీకరించబోమన్న టీఆర్ఎస్
దేశవ్యాప్తంగా పలు కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మె ఈ ఉదయం ప్రారంభమైంది. దాదాపు 25 కోట్ల మంది సమ్మెలో భాగం కానున్నారని ఇప్పటికే కార్మిక యూనియన్లు వెల్లడించగా, బ్యాంకింగ్, రిజిస్ట్రేషన్, నిత్యావసరాల పంపిణీ తదితర సేవలపై ప్రభావం పడుతుందని అంచనా. ఇక ఈ సమ్మెకు తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు పలికింది.

కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేయడాన్ని తాను అంగీకరించబోమని వ్యాఖ్యానించిన మంత్రి హరీశ్ రావు, వాటిని కాపాడుకునేందుకు ఐక్య ఉద్యమాలకు తమ పార్టీ సిద్ధంగా ఉంటుందని అన్నారు. తెలంగాణలో ఈ సమ్మె టీయూడబ్ల్యూజే, ఐజేయూ (ఇండియన్ జర్నలిస్ట్స్ యూనినియన్), తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ సంయుక్త కార్యాచరణ కమిటీలతో పాటు బీహెచ్ఈఎల్, బీడీఎల్ తదితర పలు కంపెనీల కార్మిక సంఘాలు మద్దతు పలికాయి.


More Telugu News