భారీ విధ్వంసాన్ని సృష్టిస్తూ... తీరం దాటిన 'నివర్'!
- తెల్లవారుజామున తీరం దాటిన తుపాను
- పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు
- రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్
గత రెండు రోజుల నుంచి తమిళనాడు ప్రజలకు నిద్ర లేకుండా చేసిన తీవ్ర తుపాను నివర్, ఈ తెల్లవారుజామున 2.30 గంటలకు తీరం దాటింది. ఈ విషయాన్ని వెల్లడించిన వాతావరణ శాఖ, సగటున 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, నివర్ ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరిలపై అధికంగా ఉందని తెలిపారు. తిరువణ్ణామలై, కడలూరు, విలుప్పురం, చెన్నై, కల్లకురిచ్చి ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని, మరో మూడు రోజుల పాటు తుపాను ప్రభావం కొనసాగుతుందని హెచ్చరించారు.
కాగా, తుపాను తీరం దాటే సమయంలో వీచిన గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ ఉదయం నుంచే సహాయక కార్యక్రమాలను ప్రారంభించామని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.