అయోధ్య ఎయిర్ పోర్టుకు 'మర్యాద పురుషోత్తం శ్రీరామ్ విమానాశ్రయం'గా నామకరణం
- సాధువులు హర్షం
- రాముడి పేరు పెట్టాలని కొంత కాలంగా ప్రతిపాదన
- ఆమోదించిన యూపీ మంత్రి వర్గం
అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు నిర్ణయిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ మంత్రివర్గం తీర్మానించింది. 'మర్యాద పురుషోత్తం శ్రీరామ్ విమానాశ్రయం'గా పేరు పెడుతూ నిర్ణయం తీసుకుంది. అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు పెట్టడం పట్ల సాధువులు హర్షం వ్యక్తం చేశారు. అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు పెట్టాలన్న ప్రతిపాదన కొంత కాలంగా ఉంది.
చివరకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దాన్ని ఆమోదించడం గమనార్హం. అయోధ్యలో విమానాశ్రయం నిర్మాణానికి ఇప్పటికే భూసేకరణ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కేంద్ర పౌరవిమానయాన శాఖ విమానాశ్రయ నిర్మాణ పనులు చేపట్టనుంది. అయోధ్యకు అంతర్జాతీయ, దేశీయ టెర్మినల్స్ రెండూ ఉంటాయని గతంలోనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రకటించారు. కాగా, యూపీలో ఈ ఏడాది రైతులు చెల్లించే మండీ ఫీజును 2 శాతం నుంచి ఒక శాతానికి తగ్గిస్తూ కూడా యూపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.