'సర్జికల్ స్ట్రయిక్' అంటే టీఆర్ఎస్, ఎంఐఎం ఎందుకింత ఆగమాగం అవుతున్నాయి?: విజయశాంతి
- పాతబస్తీలో సర్జికల్ స్ట్రయిక్స్ చేపడతామన్న బండి సంజయ్
- టీఆర్ఎస్, ఎంఐఎంల ఆందోళనకు కారణమేంటన్న విజయశాంతి
- ఎవరినైనా దాచిపెట్టారా? అంటూ ట్వీట్
ఇటీవల తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ హైదరాబాదు పాతబస్తీలో సర్జికల్ స్ట్రయిక్ నిర్వహిస్తామని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్, ఎంఐఎం ఎందుకంత ఆగమాగం అవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి ప్రశ్నించారు. హైదరాబాద్ పాతబస్తీలోని రోహింగ్యాలు, పాకిస్థానీల గురించి ఆ రెండు పార్టీలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయని నిలదీశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఇంటింటి సర్వే నిర్వహించిందని, పాతబస్తీలో ఎవరూ ఆ విధంగా లేరని సీఎం గారు తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్రానికి అధికారపూర్వక నివేదిక ఇవ్వొచ్చు కదా అని విజయశాంతి ట్వీట్ చేశారు. లేకుంటే ఎవరినైనా దాచిపెట్టడం వల్లనే టీఆర్ఎస్ భయాందోళనలకు గురవుతున్నదని ప్రజలు అభిప్రాయపడే అవకాశముందని వ్యాఖ్యానించారు.
కాగా, విజయశాంతి త్వరలోనే బీజేపీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్ 'సర్జికల్ స్ట్రయిక్స్' వ్యాఖ్యలకు ఆమె మద్దతు పలకడంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది.