బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన ఆఫ్ఘనిస్థాన్...17 మంది మృతి

  • బమియాన్ నగరంలో శక్తిమంతమైన పేలుళ్లు
  • నెత్తురోడిన నగరం
  • 50 మంది వరకు గాయాలపాలు
ఉగ్రవాద బాధిత దేశాల్లో ముందు వరుసలో ఉండే ఆఫ్ఘనిస్థాన్ మరోసారి నెత్తురోడింది. బమియాన్ నగరంలో జరిగిన రెండు శక్తిమంతమైన బాంబు పేలుళ్లలో 17 మంది వరకు మృతి చెందారు. దాదాపు 50 మంది గాయాలపాలయ్యారు. నగరంలోని రద్దీగా ఉండే వీధుల్లో రోడ్డు పక్కన ఉంచిన పేలుడు పదార్థాలను ఉగ్రవాదులు పేల్చివేయడంతో ఈ ఘోరకలి జరిగిందని నగర పోలీస్ చీఫ్ జబర్దస్త్ సఫాయ్ వెల్లడించారు.

ఆఫ్ఘనిస్థాన్ లోని బమియాన్ నగరంలో ఎక్కువగా షియా హజారా వర్గం ప్రజలు నివసిస్తుంటారు. ఈ దాడికి తమదే బాధ్యత అని ఇప్పటివరకు ఏ ఉగ్రసంస్థ ప్రకటించలేదు. ఆఫ్ఘనిస్థాన్ లో ప్రముఖ పర్యాటక స్థలంగా బమియాన్ పేరొందింది. అంతేకాదు, దేశంలోనే అత్యంత భద్రమైన చోటుగా భావించే బమియాన్ లో బాంబు పేలుళ్లు జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.


More Telugu News