తీరాన్ని సమీపిస్తున్న నివర్... భారీగా మోహరించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

  • బంగాళాఖాతంలో నివర్ తుపాను
  • తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై అధిక ప్రభావం
  • రంగంలోకి 22 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
  • అదనంగా మరో 8 బృందాలు
బంగాళాఖాతంలో కొనసాగుతున్న నివర్ తుపాను తమిళనాడులో తీరం దాటుతుందని అధికారులు భావిస్తున్నా, దాని ప్రభావం ఏపీ జిల్లాలపైనా గణనీయంగా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఉభయ రాష్ట్రాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించారు. తమిళనాడులో 12, ఏపీలో 7, పుదుచ్చేరిలో 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. నివర్ తుపాను ప్రభావంతో తమిళనాడులో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండడంతో అదనంగా మరో 8 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు.

తుపాను ప్రభావిత జిల్లాలకు తరలి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. తుపాను సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల వివరిస్తున్నారు. కాగా, నివర్ మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారుతుందన్న భారత వాతావరణ శాఖ ప్రకటన నేపథ్యంలో సీఎం పళనిస్వామి తమిళనాడులో రేపు సెలవు ప్రకటించారు. నివర్ తీరం దాటే వేళ  100 నుంచి 120 కిమీ వేగంతో పెనుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.


More Telugu News