ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాడు అవార్డు రేసులో కోహ్లీ, అశ్విన్

  • కోహ్లీ, అశ్విన్ లను నామినేట్ చేసిన ఐసీసీ
  • పురుషుల విభాగాలన్నింటిలోనూ నామినేట్ అయిన కోహ్లీ 
  • త్వరలో ఐసీసీ అవార్డులు
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, విలక్షణ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాడు అవార్డు రేసులో నిలిచారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ అవార్డు కోసం వీరిద్దరినీ నామినేట్ చేసింది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు కోసం ఐసీసీ మొత్తం ఏడుగుర్ని నామినేట్ చేసింది. కోహ్లీ, అశ్విన్ కాకుండా, జో రూట్ (ఇంగ్లాండ్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా), కుమార్ సంగక్కర (శ్రీలంక) ఉన్నారు.

ఇక, వన్డేల్లో దశాబ్దపు అత్యుత్తమ ఆటగాడు, టీ20ల్లో అత్యుత్తమ ఆటగాడు, అత్యుత్తమ టెస్ట్ ప్లేయర్, ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డులకు కూడా నామినేషన్లు ప్రకటించారు. ఈ విభాగాలన్నింటిలోనూ కోహ్లీ నామినేట్ కావడం విశేషం. కాగా, మహిళల విభాగంలో దశాబ్దపు అత్యుత్తమ క్రీడాకారిణి, దశాబ్దపు అత్యుత్తమ వన్డే క్రీడాకారిణి అవార్డులకు నామినేషన్లు ప్రకటించారు.


More Telugu News