పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్ చేస్తామన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్
- హైదరాబాద్ పై సర్జికల్ స్ట్రయిక్ చేస్తారా?
- కొన్ని ఓట్ల కోసం మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలా మాట్లాడుతున్నారు
- కిషన్ రెడ్డి గారు, ఈ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా?
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మేయర్ పీఠాన్ని అధిరోహించిన వెంటనే పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామని... అక్కడ ఉన్న రోహింగ్యాలు, పాకిస్థానీలను తరిమికొడతామని అన్నారు.
హిందువుల కోసం బీజేపీ పోరాడుతోందని... పాకిస్థాన్ హైదరాబాద్ కావాలా? భారతదేశ హైదరాబాద్ కావాలా? నగర ప్రజలు తేల్చుకోవాలని చెప్పారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద తమ అడ్డా పెడతామని అన్నారు. ఓ వర్గం వారు వేసిన ఓట్ల వల్ల బీహార్ లో ఎంఐఎం గెలిచిందని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ మండిపడ్డారు.
'హైదరాబాద్ పై సర్జికల్ స్ట్రయికా? కొన్నిఓట్లు, సీట్ల కోసం ఈ వ్యక్తి మతిస్థిమితం కోల్పోయినవాడిలా మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డిగారూ, మీ సహచర ఎంపీ మాట్లాడిన వివక్షపూరితమైన, ఖండించదగిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా?' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.