నివర్ తుపాను దృష్ట్యా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్

  • బంగాళాఖాతంలో నివర్ తుపాను
  • అధికారులను అప్రమత్తం చేసిన సీఎం జగన్
  • రేపు సాయంత్రం నుంచి ఎల్లుండి వరకు ప్రభావం ఉంటుందని వెల్లడి
బంగాళాఖాతంలో నివర్ తుపాను ఏర్పడిన నేపథ్యంలో సీఎం జగన్ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుపాను నేరుగా ఏపీని తాకకున్నా, సమీప ప్రాంతంలో దాని తీవ్రత ఉండనుందని తెలిపారు. అయితే ఏపీలోని పలు ప్రాంతాలకు భారీ వర్షసూచన ఉందని, రేపు సాయంత్రం నుంచి ఎల్లుండి వరకు తుపాను ప్రభావం ఉంటుందని వివరించారు.

తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తం కావాలని హెచ్చరించారు. కాగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న నివర్ తుపాను రేపు సాయంత్రం తీరం దాటనుంది. ఏపీలో దీని ప్రభావం నాలుగు జిల్లాలపై అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది.


More Telugu News