దర్శకుడు రాంగోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు షోకాజ్ నోటీసులు
- దిశ ఎన్ కౌంటర్ పేరిట చిత్రం తెరకెక్కించిన వర్మ
- హైకోర్టును ఆశ్రయించిన దిశ ఘటన నిందితుల కుటుంబసభ్యులు
- ఈ సినిమా వస్తే తమను గ్రామంలో కూడా ఉండనివ్వరని ఆవేదన
దిశ ఎన్ కౌంటర్ చిత్రం నేపథ్యంలో దర్శకుడు రాంగోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దిశ ఎన్ కౌంటర్ చిత్రాన్ని నిలిపివేయాలని దిశ ఘటన నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్ కౌంటర్ మృతుల కుటుంబాలు ఇప్పటికే మనోవేదనకు గురవుతున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కృష్ణమూర్తి కోర్టుకు తెలిపారు.
ఇప్పుడు ఈ సినిమా తీసి వారిని గ్రామంలో కూడా ఉండనివ్వకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సినిమాలో వారిని దోషులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దిశ ఎన్ కౌంటర్ చిత్రం విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరారు.
దీనిపై దర్శకుడు రాంగోపాల్ వర్మను వివరణ కోరిన న్యాయస్థానం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. కాగా ఈ సినిమాను ఆపాలంటూ అటు దిశ కుటుంబ సభ్యులు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.