పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తాం: బండి సంజయ్
- మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే దాడి చేస్తాం
- రోహింగ్యాలను, పాకిస్థానీలను తరిమి కొడతాం
- ఒవైసీ వ్యాఖ్యలకు సంజయ్ కౌంటర్
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, ఎంఐఎం నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎంఐఎం పార్టీ ఒక ఉగ్ర సంస్థ అంటూ బండి సంజయ్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నారని అన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్దే తమ అడ్డా పెడతామని చెప్పారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, ఇక్కడ రోహింగ్యాలు ఉన్నట్టైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఈ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందిస్తూ, పాతబస్తీలో ఉన్న రోహింగ్యాలు, పాకిస్థాన్ వాసులే ఎంఐఎంకు ఓటేస్తున్నారని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో విజయం సాధించి, మేయర్ పీఠాన్ని దక్కించుకున్న వెంటనే పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామని అన్నారు. రోహింగ్యాలను, పాకిస్థానీలను తరిమితరిమి కొడతామని చెప్పారు.