సోషల్ మీడియాలో ఏ ట్రెండ్ చూసినా మోదీ, జగన్ లదే హవా!
- అత్యధిక ట్రెండింగ్స్ లో మోదీకి అగ్రస్థానం
- తర్వాత స్థానంలో నిలిచిన ఏపీ సీఎం
- చెక్ బ్రాండ్ సంస్థ ఆసక్తికర అధ్యయనం
భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం జగన్ సోషల్ మీడియాలో తమ ప్రాభవం కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్లలో దేశంలోని అత్యంత ప్రజాదరణ ఉన్న నేతల్లో వీరిద్దరి తర్వాతే ఎవరైనా. అనేక సోషల్ మీడియా వేదికల్లో నడిచే ట్రెండ్స్ లో ప్రధాని మోదీ అత్యధిక పర్యాయాలు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారట. ఈ విధమైన ఘనతలో ఏపీ సీఎం జగన్ రెండో స్థానంలో ఉన్నారని ఓ పరిశీలనలో వెల్లడైంది. ట్విట్టర్, గూగుల్ సెర్చ్, యూట్యూబ్... ఇలా వేదిక ఏదైనా ఇదే వరుస!
చెక్ బ్రాండ్ అనే ఆన్ లైన్ సెంటిమెంట్ విశ్లేషణ సంస్థ ఆగస్టు నుంచి అక్టోబరు వరకు నడిచిన ట్రెండ్స్ ను పరిశీలించగా మోదీ, జగన్ ల ఆధిపత్యం వెల్లడైంది.
చెక్ బ్రాండ్ తన అధ్యయనంలో 95 మంది అగ్రశ్రేణి రాజకీయ నాయకులు, 500 మంది ఉన్నతశ్రేణి ప్రభావశీలురైన వ్యక్తులను సోషల్ మీడియాలో పరిశీలిచింది. ఆగస్టు నుంచి అక్టోబరు వరకు ప్రధాని మోదీ ట్విట్టర్, గూగుల్ సెర్చ్, వికీ, యూట్యూబ్ వంటి వేదికలపై 2,171 ట్రెండ్స్ లో అగ్రస్థానం దక్కించుకోగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2,137 ట్రెండ్స్ లో టాప్ పొజిషన్ లో నిలిచారు. మోదీ, జగన్ ల మధ్య తేడా చాలా తక్కువ అని చెక్ బ్రాండ్ గణాంకాలు చెబుతున్నాయి.
ఇక వీరిద్దరి తర్వాత స్థానంలో పశ్చిమ బెంగాల్ ఫైర్ బ్రాండ్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ ఉన్నారు.