పుత్తడి నేల చూపులు... 10 గ్రాముల ధర నాలుగు నెలల తరువాత తొలిసారి 49 వేల దిగువకు!

  • మంగళవారం ట్రేడింగ్ లో మరింత పతనం
  • రూ. 48,925కు 10 గ్రాముల ధర
  • తగ్గిన కిలో వెండి ధర
ఇప్పటికే భారీగా తగ్గిన బంగారం ధర, ఈ ఉదయం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో మరింతగా పడిపోయింది. ఇన్వెస్టర్లు బులియన్ మార్కెట్ నుంచి తమ పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్ల వైపు మళ్లిస్తుండటంతో, బంగారం ధర నాలుగు నెలల కనిష్ఠానికి పడిపోయింది. పుత్తడి ధరలు వరుసగా రెండో రోజూ పతనం దిశగా సాగగా, ఈ ఉదయం 10 గ్రాముల బంగారం ధర రూ. 49 వేల కన్నా దిగువకు వచ్చింది.

మధ్యాహ్నం 12 గంటల సమయంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో బంగారం రేటు రూ.48,925 వద్ద కదులుతోంది. జూన్ తరువాత బంగారం ధర ఇంత తక్కువ స్థాయికి దిగిరావడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ. 60 వేల కన్నా దిగువకు వచ్చి రూ. 59.760కి వచ్చింది. ఫ్యూచర్స్ మార్కెట్ లోనూ పరిస్థితి ఇదే విధంగా ఉంది. డిసెంబర్ కాంట్రాక్టులు మరింతగా దిగజారుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఇదే విధమైన పరిస్థితి నెలకొని వుండటంతో బంగారం ధరలు మరింతగా తగ్గుతాయని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.


More Telugu News