మహారాష్ట్రలో మరో రెండుమూడు నెలల్లో అధికారంలోకి బీజేపీ: కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

  • పర్భణిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
  • మన ప్రభుత్వం వస్తుందంటూ కార్యకర్తలకు భరోసా
  • ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యే వరకు వేచిచూస్తున్నామన్న మంత్రి
మరో రెండుమూడు నెలల్లో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి రావ్‌సాహెబ్ దన్వే పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెలలో ఔరంగాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పర్భణిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం అనంతరం బీజేపీ కార్యకర్తలతో మాట్లాడుతూ కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

వచ్చే రెండు, మూడు నెలల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ‘‘మన ప్రభుత్వం అధికారంలోకి రాదని అనుకోకండి. మరో రెండు, మూడు నెలల్లో అధికారంలోకి వస్తాం. ఇందుకు సంబంధించి లెక్కలు వేసుకుంటున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలు అయ్యేంత వరకు వేచి చూస్తున్నాం’’ అని దన్వే పేర్కొన్నారు.


More Telugu News