తమిళ హాస్యనటుడు తవసి కన్నుమూత

  • క్యాన్సర్ తో బాధపడుతున్న తవసి
  • మధురై ఆసుపత్రిలో చికిత్స
  • సాయం కోసం వేడుకున్న వైనం
  • చికిత్స పొందుతూ మృతి
తమిళంలో అనేక చిత్రాల్లో హాస్యనటుడిగా, క్యారక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన తవసి ఈ సాయంత్రం కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన, మధురైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవలే తనకు ఆర్థికసాయం చేసి ఆదుకోవాలంటూ ఆయన దీనంగా విజ్ఞప్తి చేశారు.

ఒకప్పుడు ఎంతో పుష్టిగా ఉన్న తవసి ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో అత్యంత దయనీయంగా చిక్కిశల్యమైన స్థితిలో కనిపించారు. గుర్తుపట్టలేని విధంగా ఉన్న ఆయనను చూసి అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ క్రమంలో దాతలు స్పందించే లోపే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం దురదృష్టకరం. ఆయన మృతికి తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.


More Telugu News