ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి చేదు అనుభవం

  • జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి వెళ్లిన ఒవైసీ
  • పలువురు ముస్లిం మహిళల నిలదీత
  • వరద సహాయం తమకు అందలేదని విమర్శలు
  • జాంబాగ్‌ డివిజన్ నుంచి వెనుదిరిగిన ఒవైసీ
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురైన విషయం తెలిసిందే. వారిలో కొంత మందికి మాత్రమే ప్రభుత్వం నుంచి వరద సాయం అందిందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి వెళ్లిన అసదుద్దీన్ ను పలువురు ముస్లిం మహిళలు నిలదీశారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం తమకు అందలేదని చెప్పారు. కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకోని ఒవైసీకి ఇప్పుడు ఓట్ల కోసం గుర్తు కొచ్చామంటూ విమర్శించారు. ఇప్పుడెందుకు వచ్చావంటూ ఆయనను నిలదీశారు. మహిళలు నిలదీయడంతో ఒవైసీ వెంటనే అక్కడి నుంచి వెనుదిరిగారు. జాంబాగ్‌ డివిజన్‌ ఎంఐఎం అభ్యర్థికి మద్దతుగా ఒవైసీ ఈ రోజు  ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, గ్రేటర్ హైదరాబాద్‌లో‌ ఎంఐఎం 52 స్థానాల్లో పోటీ చేస్తోంది.


More Telugu News