కరణ్ జొహార్ చేసిన పని చాలా అనైతికం: దర్శకుడు మాధుర్ భండార్కర్ ఫైర్
- నా సినిమా టైటిల్ కావాలని కరణ్ అడిగాడు
- అప్పటికే షూటింగ్ ప్రారంభం కావడంతో ఇవ్వలేనని చెప్పాను
- అయినా వెబ్ సిరీస్ కు నా టైటిల్ పెట్టుకున్నాడు
బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జొహార్ ఇటీవలి కాలంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఇండస్ట్రీలోని నెపోటిజంకు కరణ్ జొహార్ కూడా ఒక కారణమనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత డ్రగ్స్ అంశంలో కూడా ఆయన పేరు తెరపైకి వచ్చింది. తాజాగా కరణ్ పై మరో దర్శకుడు మాధుర్ భండార్కర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తన పేరిట రిజిస్టర్ అయిన టైటిల్ ను వాడుకుంటున్నాడని విమర్శించారు.
'బాలీవుడ్ వైవ్స్' అనే పేరుతో తాను సినిమాను తెరకెక్కిస్తున్నానని... షూటింగ్ కూడా ప్రారంభమైందని మాధుర్ భండార్కర్ తెలిపారు. ఆ టైటిల్ ఇవ్వాలని కరణ్ జొహార్ తనను అడిగాడని... ఆయన రూపొందిస్తున్న వెబ్ సిరీస్ కు ఆ టైటిల్ పెట్టుకుంటానన్నారని చెప్పారు. అయితే తన సినిమా షూటింగ్ అప్పటికే ప్రారంభం కావడంతో... టైటిల్ ను ఇవ్వలేనని చెప్పానని తెలిపారు. దీంతో, తన వెబ్ సిరీస్ కు ఆయన 'ఫ్యాబ్యులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్' అనే టైటిల్ పెట్టుకున్నాడని... తమ టైటిల్ ను ఇలా వాడుకోవడం అనైతికమని విమర్శించారు.