దక్షిణాఫ్రికాలో కరోనాతో గాంధీ ముని మనవడు సతీశ్ ధూపేలియా మృతి
- దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో మృతి
- జోహన్నెస్‌బర్గ్‌లో నివసించిన సతీశ్
- మీడియాలో వీడియోగ్రాఫర్, ఫొటోగ్రాఫర్‌గా పని
మహాత్మా గాంధీ ముని మనుమడు సతీశ్ ధూపేలియా కన్నుమూశారు. న్యూమోనియాతో బాధపడుతూ నెల రోజుల పాటు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న సతీశ్.. అనంతరం కరోనా బారిన పడ్డారని, చికిత్స పొందుతున్న సమయంలో సతీశ్‌కి నిన్న గుండెపోటు వచ్చి కన్నుమూశారని ఆయన సోదరి ఉమా ధూపేలియా మెస్త్రీ తెలిపారు.
సతీశ్ తో పాటు ఆయన సోదరి ఉమా, మరో సోదరి కీర్తి మీనన్ జోహన్నెస్‌బర్గ్‌లో నివసిస్తున్నారు. వీరంతా కలిసి మహాత్మా గాంధీ చూపిన మార్గంలో రెండు దశాబ్దాలుగా అక్కడ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
సతీశ్ ధుపేలియా మీడియాలో వీడియోగ్రాఫర్, ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. తన ముత్తాత గాంధీజీ ప్రారంభించిన ‘గాంధీ డెవలప్‌మెంట్ ట్రస్ట్’ ద్వారా అనేక సేవ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆదర్శంగా నిలిచారు. మహాత్మాగాంధీ రెండో కుమారుడు మనీలాల్ గాంధీ మనవడే సతీశ్ ధుపేలియా.