రేపు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకోనున్న రాష్ట్రపతి

  • చెన్నై నుంచి వైమానికదళ విమానంలో తిరుపతికి
  • స్వాగతం పలకనున్న గవర్నర్, సీఎం
  • శ్రీపద్మావతి అమ్మవారి దర్శనానంతరం తిరుమలకు
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రేపు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. చెన్నై నుంచి వైమానిక దళ ప్రత్యేక విమానంలో ఉదయం పదిన్నర గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడాయనకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతం పలుకుతారు. అనంతరం తిరుచానూరు చేరుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12.15 గంటలకు తిరుమలలోని విశ్రాంతి గృహానికి చేరుకుంటారు. స్వామివారి దర్శనానంతరం మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల నుంచి బయలుదేరి విమానాశ్రయం చేరుకుంటారు. 3.50 గంటలకు అక్కడి నుంచి అహ్మదాబాద్ వెళ్తారు.


More Telugu News