2023 జీ-20 శిఖరాగ్ర సదస్సు ఇండియాలో!
- ఈ సంవత్సరం ఆతిథ్యమిచ్చిన సౌదీ అరేబియా
- ఆదివారం నాడు విడుదలైన డిక్లరేషన్
- వచ్చే ఏడాది సదస్సు ఇటలీలో
2023లో అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాల సమాఖ్య జీ-20 సదస్సుకు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. తొలుత 2022లో ఇండియాలో ఈ సమావేశాలు జరుగుతాయని ప్రకటన రాగా, ఇప్పుడు దాన్ని మరో ఏడాది ముందుకు మార్చారు. ఈ సంవత్సరం జీ-20 సమావేశాలు సౌదీ అరేబియాలోని రియాద్ లో సాగగా, కరోనా కారణంగా నేతలంతా వర్చ్యువల్ విధానంలోనే పాల్గొన్నారు.
ఆపై 2021లో ఇటలీలో, 2022లో ఇండొనేషియాలో, 2023లో ఇండియాలో, 2024లో బ్రెజిల్ లో ఈ సమావేశాలు జరుగుతాయని ఆదివారం నాడు విడుదలైన రియాద్ సమ్మిట్ నేతల డిక్లరేషన్ వెల్లడించింది. సభ్య దేశాల మధ్య చర్చలు, సమావేశాల రొటేషన్ విధానం, పరస్పర అంగీకారంతోనే సదస్సు షెడ్యూల్ ను స్వల్పంగా మార్చినట్టు నేతలు పేర్కొన్నారు. ఇక, ఇటలీ, ఇండొనేషియా సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలను బట్టి, 2023 సదస్సు అజెండాను తయారు చేయాలని భావిస్తున్నట్టు భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.