రూ. 2.20 కోట్లు దాటిన తిరుమల హుండీ ఆదాయం!

  • ఆదివారం నాడు స్వామిని దర్శించుకున్న 32,640 మంది
  • మంగళవారం తిరుమలకు రానున్న రాష్ట్రపతి కోవింద్
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని హుండీ ఆదాయం ఆదివారం నాడు రూ. 2.26 కోట్లుగా ఉంది. నిన్న స్వామివారిని 32,640 మంది భక్తులు దర్శించుకున్నారని, 10,946 మంది తలనీలాలు సమర్పించారని అధికారులు తెరిపారు. ఆలయ పరిధిలో కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నట్టు తెలిపారు.

కాగా, రేపు ఉదయం తిరుమలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రానున్నారు. ఉదయం 10.30 గంటలకు తిరుపతి చేరుకునే ఆయన, తొలుత తిరుచానూరు వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆపై మధ్యాహ్నం తిరుమలకు వెళ్లి, స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేస్తారు. కోవింద్ పర్యటన నిమిత్తం అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.


More Telugu News