ఎంఐఎంకు ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదు: కిషన్ రెడ్డి

  • ఎంఐఎం కుటుంబ పార్టీ అన్న కిషన్ రెడ్డి
  • బీజేపీ దృష్టిలో అది రజాకార్ల పార్టీ అని వ్యాఖ్యలు
  • పేద ముస్లింలను చిత్రహింసల పాల్జేశారని ఆరోపణ
పేద ముస్లింలను వేధించుకుతినే పార్టీ ఎంఐఎం అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. వేలమంది ముస్లింలను ఆ పార్టీ చిత్రహింసలకు గురిచేసిందని ఆరోపించారు. కుటుంబ రాజకీయాలు చేసే ఎంఐఎంకి, ముస్లింలకు ఎలాంటి సంబంధంలేదని అన్నారు. ముస్లిం సోదరులు వేరు, మజ్లిస్ వేరు అని స్పష్టం చేశారు.

బీజేపీ దృష్టిలో ఎంఐఎం అంటే రజాకార్ల పార్టీ మాత్రమేనని అభివర్ణించారు. మాఫియాను ఉపయోగించుకుని పేద ముస్లింల భూములు లాగేసుకోవడం ఎంఐఎం పంథా అని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే హైదరాబాద్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.


More Telugu News