రోడ్డుపై అమ్మాయిలను వేధించిన యువకులు.. బింగిళ్లు తీయించి, తీసుకెళ్లిన పోలీసులు.. వీడియో ఇదిగో
- మధ్యప్రదేశ్‌లో ఘటన
- రోడ్లపై తిరుగుతూ పిచ్చివేషాలు వేస్తోన్న పోకిరీలు
- అక్కడే బుద్ధి చెప్పిన పోలీసులు
రోడ్లపై తిరుగుతూ అమ్మాయిలను వేధిస్తోన్న ఇద్దరు యువకులకు పోలీసులు రోడ్డుపైనే బుద్ధి చెప్పారు. వారితో బింగిళ్లు తీయిస్తూ కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బిజీ రోడ్డులో నిన్న ఇద్దరు పోకిరీలు మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తుండడంతో పోలీసులు వారి చెవులు పట్టుకుని దేవాస్ వీధిలో తిప్పుతూ తీసుకెళ్లారు.
ఆ యువకులకు పోలీసులు రోడ్డుపై అందరిముందూ బుద్ధిచెప్పడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటువంటి వారిని అందరి ముందూ శిక్షిస్తేనే మరొకరు ఇలాంటి పనులు చేయడానికి భయపడతారని కామెంట్లు చేస్తున్నారు.
ఆ యువకులకు పోలీసులు రోడ్డుపై అందరిముందూ బుద్ధిచెప్పడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటువంటి వారిని అందరి ముందూ శిక్షిస్తేనే మరొకరు ఇలాంటి పనులు చేయడానికి భయపడతారని కామెంట్లు చేస్తున్నారు.