వైసీపీ చర్యలు సరికాదు: యనమల, చినరాజప్ప విమర్శలు
- సుప్రీంకోర్టు సీజేకు జగన్ రాసిన లేఖ సరికాదు
- న్యాయమూర్తులు సీరియస్‌గా తీసుకోవాలి
- ఇటువంటి చర్యలను ఖండించాలి
- లేదంటే నిందితులంతా ఇదే దారిలో వెళతారు
సుప్రీంకోర్టు సీజేకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖను న్యాయమూర్తులు సీరియస్‌గా తీసుకోవాలని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. న్యాయమూర్తులంతా ఏకతాటిపై నిలిచి ఇటువంటి చర్యలను ఖండించాలని ఆయన చెప్పారు. ఇలా చేయకపోతే నిందితులంతా ఇదే దారిలో వెళతారని అన్నారు.
న్యాయమూర్తులను జగన్ మొదటి నుంచి లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన అన్నారు. జగన్ అనుచరులు కూడా అదే దారిలో వెళుతున్నారని యనమల అన్నారు. న్యాయస్థానాల ముందు ట్రయల్స్‌లో జగన్ పై 31 కేసులు ఉన్నాయని తెలిపారు. అందుకే జగన్ ఆ లేఖను రాశారని ఆయన చెప్పారు.
న్యాయవ్యవస్థపై వ్యాఖ్యలు చేసి దోషిగా తేలిన ప్రశాంత్ భూషణ్‌పై స్పందించినట్లే జగన్ లేఖను కూడా న్యాయస్థానం సీరియస్‌గా తీసుకోవాలని అన్నారు. జగన్ తీరు వల్ల రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు నాశనమవుతాయని చెప్పారు. నిందితులు ఇలా పైకోర్టుల న్యాయమూర్తులను బెదిరిస్తే దిగువ కోర్టులు ఎలా పనిచేస్తాయని ఆయన నిలదీశారు.
కాగా, వైసీపీ సర్కారుపై టీడీపీ నేత చినరాజప్ప కూడా విమర్శలు గుప్పించారు. పోలవరం నిర్మాణంపై వైసీపీ సర్కారుకు చిత్తశుద్ధి లేదని, టీడీపీ పాలనలో మాత్రం పోలవరం పనులు 70శాతం పూర్తయ్యాయని చెప్పారు. ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తున్నారని, ప్రాజెక్ట్ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆయన చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.