కాబూల్ పై రాకెట్ల వర్షం... వీడియో ఇదిగో!

  • నగరాన్ని కుదిపేసిన రాకెట్లు
  • ఐదుగురి దుర్మరణం, 20 మందికి పైగా గాయాలు
  • తాము దాడులు చేయలేదన్న తాలిబాన్లు
ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ ను శనివారం నాడు రాకెట్ దాడులు కుదిపేశాయి. కాబూల్ ను కనీసం 14 రాకెట్లు తాకాయని, కనీసం ఐదుగురు మరణించగా, దాదాపు 20 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారని న్యూస్ ఏజన్సీ 'ఏఎఫ్పీ' పేర్కొంది. ఈ రాకెట్లన్నీ జనసమ్మర్దం ఉన్న ప్రాంతాల్లోనూ, గ్రీన్ జోన్ ఏరియాల్లోనూ పడ్డాయని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

అంతకుముందు రెండు ఐఈడీ బాంబులు కూడా పేలాయి. ఇక ఈ దాడుల వెనుక ఎవరున్నారన్న విషయాన్ని గుర్తించలేదు. ఏ ఉగ్రవాద సంస్థ కూడా దాడులకు తామే పాల్పడ్డామని ప్రకటించలేదు. తాలిబాన్లు మాత్రం ఈ రాకెట్ దాడులకు తాము కారణం కాదని స్పష్టం చేసింది. కాబూల్ నగరంపై రాకెట్ల దాడి, ప్రజలు తీవ్ర ఆందోళనతో పరుగులు పెడుతుండటం, వాహనాలు ధ్వంసం కావడం వంటి దృశ్యాలతో కూడిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. దాన్ని మీరు కూడా చూడవచ్చు. 


More Telugu News