బ్రిటన్ మహారాణి హనీమూన్ పిక్... 24 గంటల్లో 6 లక్షలకు పైగా లైక్స్!
- 1947, నవంబర్ 20న ఎలిజబెత్, ఫిలిప్ వివాహం
- ఇటీవల 73వ వివాహ వార్షికోత్సవం
- ప్రత్యేక చిత్రాలు విడుదల చేసిన రాజ భవనం
బ్రిటన్ మహారాణి ఎలిజబెత్, డ్యూక్ ఆఫ్ ఎడింబరో ఫిలిప్ ల వివాహం 1947, నవంబర్ 20న జరుగగా, ఈ దంపతులు ఇటీవల తమ 73వ మ్యారేజ్ యానివర్సరీని జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాయల్ ఫ్యామిలీకి చెందిన కొన్ని చిత్రాలను రాజభవన అధికారులు సోషల్ మీడియాలో విడుదల చేశారు. వాటిల్లో ఓ చిత్రం తెగ వైరల్ అయి, 24 గంటల వ్యవధిలోనే 6 లక్షల లైక్స్ ను తెచ్చుకుంది.
ఈ దంపతులు తమ వివాహం తరువాత, హనీమూన్ నిమిత్తం హాంప్ షైర్ పరిధిలో ఉన్న బ్రాడ్ ల్యాండ్స్ కు వెళ్లారు. అప్పట్లో వారిద్దరూ ఈ చిత్రాన్ని తీయించుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ చిత్రంలో ఎలిజబెత్ ఎంతో అందంగా కనిపిస్తూ, తన చేత్తో ఫిలిప్ చేతిని పట్టుకుని ఆయన కళ్లలోకి చూస్తున్నారు. ఈ చిత్రం బ్రిటన్ వాసులను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు ఎన్నో దేశాల వారికి నచ్చేసింది.
ఇక ఈ చిత్రంతో పాటు ప్రిన్స్ విలియం సంతానమైన ప్రిన్స్ జార్స్, లూయీ, ప్రిన్సెస్ చార్లొట్టేలు స్వయంగా చేత్తో తయారు చేసిన మ్యారేజ్ యానివర్సరీ గ్రీటింగ్ ను రాజ దంపతులు మురిపెంగా చూసుకుంటున్న మరో చిత్రాన్ని కూడా అధికారులు విడుదల చేశారు.