అమెరికాలో అధికార బదిలికీ సర్వం సిద్ధం.. జనవరి 20న బైడెన్‌కు పగ్గాలు!

  • ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన బైడెన్
  • వైట్‌హౌస్‌ను వీడేందుకు నిరాకరిస్తున్న ట్రంప్
  • ట్రంప్ ఆరోపణలకు ఆధారాలు లేవన్న వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు వైట్‌హౌస్ అధికార యంత్రాంగం సర్వం సిద్దం చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బైడెన్‌కు 306, ట్రంప్‌నకు 232 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. అధ్యక్షుడు కావాలంటే కనీసం 270 ఓట్లు అవసరం. ఈ నేపథ్యంలో బైడెన్‌కు అధికారాన్ని బదలాయించేందుకు శ్వేతసౌధం ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు, ట్రంప్ మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, కాబట్టి వైట్‌హౌస్‌ను వీడేది లేదని చెబుతున్నారు.

ఈ సందర్భంగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్‌నానీ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోలైన ప్రతీ ఓటును లెక్కించాలని ట్రంప్ పట్టుబడుతున్నట్టు చెప్పారు. ఓటింగులో మోసాలు జరిగినట్టు నిజమైన ఆరోపణలు ఉన్నాయని, అయితే, ఇందుకు తగిన ఆధారాలు లేవని అన్నారు. ఈ నేపథ్యంలో అధికార బదిలీకి అవసరమైన ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.


More Telugu News