అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ ఆరోగ్య పరిస్థితి విషమం
- ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న గొగోయ్
- క్షీణించిన ఆరోగ్యం
- మళ్లీ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
ఇటీవల కరోనా బారినపడిన అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ (85) ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆయన శరీరంలోని కీలక అవయవాలు వైఫల్యం చెందడంతో ఆయనకు వైద్యులు వెంటిలేటర్ అమర్చారు.
తరుణ్ గొగోయ్ కొన్ని వారాల కిందట ఆయాసంతో బాధపడుతుండడంతో గువాహటి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స చేశారు. ఆ సమయంలోనే ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఐసీయూలో చికిత్స సందర్భంగా ఆయనకు ప్లాస్మా థెరపీ అందించారు. దాంతో ఆయన కోలుకున్నట్టే కనిపించారు. గత నెల 25న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో మళ్లీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఆయన కుమారుడు, ఎంపీ గౌరవ్ గొగోయ్ వెల్లడించారు. కాంగ్రెస్ సీనియర్ నేత గొగోయ్ గతంలో మూడు సార్లు సీఎంగా వ్యవహరించారు.