గత ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాల ఫలితమే ప్రజలు అమరావతిలోనూ ఆ పార్టీని చిత్తుగా ఓడించారు: అంబటి

  • టీడీపీ అధినాయకత్వంపై విమర్శలు చేసిన అంబటి
  • చంద్రబాబు మాయలమారి వేషాలు వేస్తున్నారని వ్యాఖ్యలు
  • జగన్ పాలన చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శలు
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినాయకత్వంపై విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్లలో టీడీపీ పాలన యావత్తు అస్తవ్యస్త నిర్ణయాలతో సాగిందని, దాని ఫలితమే ప్రజలు ఆ పార్టీని గత ఎన్నికల్లో ఓడించారని పేర్కొన్నారు. చివరికి అమరావతిలోనూ టీడీపీకి ఓటమి తప్పలేదని, చంద్రబాబు వారసుడ్ని సైతం ఇంటిముఖం పట్టించారని వెల్లడించారు. ఇప్పుడు అధికారం లేకపోయేసరికి చంద్రబాబు మాయలమారి వేషాలు వేస్తూ కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

సీఎం జగన్ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయేలా పరిపాలన చేస్తుంటే చంద్రబాబు అనుకూల మీడియా, ఆయన వర్గం దాన్ని జీర్ణించుకోలేకపోతోందని అన్నారు. చంద్రబాబు గ్రామ కమిటీలతో గ్రామాలను భ్రష్టుపట్టించారని ఆరోపించారు. రాష్ట్రంలో 32 లక్షల పేదలకు ఇళ్లు లేవంటే గత ప్రభుత్వ వైఫల్యమేనని, అందుకు వారు సిగ్గుపడాలని అన్నారు.


More Telugu News