మమతా బెనర్జీకి షాక్ ఇవ్వనున్న ఐదుగురు ఎంపీలు?
- ఐదుగురు ఎంపీలు బీజేపీలో చేరుతారన్న బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్
- వీరిలో సౌగతారాయ్ కూడా ఉన్నారని వ్యాఖ్య
- మేనల్లుడికి పదవులు కట్టబెట్టేందుకు మమత యత్నిస్తున్నారని విమర్శ
మరికొన్ని రోజుల్లో పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాక్ తగిలేటట్టుంది. టీఎంసీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ పార్టీలో చేరనున్నట్టు బెంగాల్ బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఎంసీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఏ సమయంలోనైనా వారు బీజేపీలో చేరుతారని అన్నారు. వీరిలో టీఎంసీ సీనియర్ నేత, ఎంపీ సౌగతా రాయ్ కూడా ఉన్నారని చెప్పారు.
ప్రస్తుతం మమతా బెనర్జీ ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పదవులు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అర్జున్ సింగ్ అన్నారు. ప్రజానాయకుడిగా పేరుగాంచిన రాష్ట్ర మంత్రి సువెందు అధికారిని అవమానించారని, ఆయన అనుచరులపై కేసులు పెట్టారని... అందుకే ఆయన టీఎంసీపై ఉద్యమం చేస్తున్నారని చెప్పారు. అలాంటి ప్రజానాయకుడికి బీజేపీ ఎప్పుడూ స్వాగతం పలుకుతుందని అన్నారు.