ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరిట చెన్నైలో డబ్బింగ్ స్టూడియో ప్రారంభం

  • కరోనా ప్రభావంతో కన్నుమూసిన బాలు
  • డబ్బింగ్ స్టూడియోపై అప్పట్లో ప్రకటన చేసిన రాధారవి
  • కేవలం రెండు నెలల వ్యవధిలోనే స్టూడియో ఏర్పాటు
భారత సినీ సంగీత ప్రియులను తన గానమాధుర్యంతో ఓలలాడించిన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా ఈ లోకాన్ని విడిచిన సంగతి తెలిసిందే. అయితే బాలు మృతి అనంతరం చెన్నైలో ఆయన పేరిట ఓ డబ్బింగ్ స్టూడియో నెలకొల్పుతానని సీనియర్ నటుడు రాధారవి ప్రకటించారు. రాధారవి ప్రస్తుతం దక్షిణ భారత సినీ, టెలివిజన్ కళాకారుల సంఘానికి అధ్యక్షుడుగా ఉన్నారు. ఇప్పుడాయన తన మాట నిలబెట్టుకుంటూ ఎస్పీబీ డబ్బింగ్ స్టూడియోను చెన్నైలో ప్రారంభించారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే రాధారవి ఈ స్టూడియోను తీసుకురావడం విశేషం.

ఎస్పీ బాలు గాయకుడిగానే కాకుండా డబ్బింగ్ కళాకారుడిగానూ ఎంతో గుర్తింపు అందుకున్నారు. ఆయన కమలహాసన్, రజనీకాంత్ వంటి నట దిగ్గజాలకు గొంతు అరువిచ్చారు. ఎస్పీబీ పేరిట డబ్బింగ్ స్టూడియో ప్రారంభం కావడం పట్ల దక్షిణాది కళాకారుల సంఘం హర్షం వ్యక్తం చేసింది.


More Telugu News