బండి సంజయ్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు: మంత్రి జగదీశ్వర్ రెడ్డి

  • గుడి పేరుతో అబద్ధాలాడటం బీజేపీకి అలవాటే
  • సంజయ్ తనకు తాను పెద్ద నేతగా ఊహించుకుంటున్నారు
  • మోదీని కూడా ఒవైసీ కలిశారు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. గుడి పేరు చెప్పి అబద్ధాలాడటం బీజేపీకి ముందు నుంచి అలవాటేనని విమర్శించారు. వరద సాయాన్ని ఆపాలంటూ ఈసీకి లేఖ రాయలేదని బండి సంజయ్ అంటున్నారని... అలాంటప్పుడు వరద సాయాన్ని కొనసాగించాలని మరో లేఖ రాయాల్సిందని చెప్పారు.

బండి సంజయ్ తనకు తాను ఒక పెద్ద నాయకుడిగా ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎంఐఎంతో కేసీఆర్ కు అవగాహన ఉందని బండి సంజయ్ అంటున్నారని... ప్రధాని మోదీని కూడా అసదుద్దీన్ ఒవైసీ కలిశారని, అసదుద్దీన్ తో మోదీ ఎందుకు సమావేశమయ్యారో సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనవసర విషయాలను వదిలేసి... అభివృద్ధి గురించి మాట్లాడాలని హితవు పలికారు.


More Telugu News