ఆరోగ్యానికి మంచి కాదు.. ఇక ఢిల్లీలో ఉండవద్దు: సోనియాకు వైద్య నిపుణుల సలహా
- ఉబ్బసం, ఛాతీ నొప్పి పెరిగే అవకాశం
- కాలుష్యం పెరిగిపోయిందని వైద్యుల హెచ్చరిక
- గోవా లేదా చెన్నైకి వెళ్లనున్న సోనియా గాంధీ
కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి పెరిగిపోయిన దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వైద్య నిపుణులు సూచించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ వర్గాలే స్వయంగా పేర్కొన్నాయి. వైద్యుల సూచనల మేరకు సోనియా గోవా లేదా చెన్నైకి వెళ్లతారని, కొంతకాలం అక్కడే ఉంటారని వెల్లడించాయి. సోనియాతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక కూడా వెళ్లనున్నారని సమాచారం.
కాగా, సోనియా గత కొంతకాలంగా ఛాతీలో ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమస్య కారణంగా జూలై 30న ఆమె గంగారాం హాస్పిటల్ లో చికిత్సను కూడా పొందారు. ఆపై సెప్టెంబర్ లో విదేశాలకు వెళ్లి వైద్య పరీక్షలు కూడా చేయించుకుని వచ్చారు. ఇక ఢిల్లీలో పెరిగిన కాలుష్యం కారణంగా సోనియా గాంధీకి ఉబ్బసం సోకే అవకాశాలు అధికమని, ఆపై ఛాతీ నొప్పి తీవ్రతరం కావచ్చని వైద్యులు హెచ్చరించారు.