పీఓకే పైకి యుద్ధ విమానాలను పంపలేదు: ఇండియన్ ఆర్మీ
- ఎయిర్ స్ట్రయిక్స్ జరిపినట్టు కథనాలు
- ఫేక్ న్యూస్ గా అభివర్ణించిన ఎల్జీ పరమ్ జిత్
- అటువంటిదేమీ జరగలేదని స్పష్టీకరణ
పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్ భూ భాగంపైకి మరోమారు యుద్ధ విమానాలను పంపి ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసినట్టు నిన్న వచ్చిన వార్తలు అవాస్తవమని భారత ఆర్మీ స్పష్టం చేసింది. ఉగ్ర స్థావరాలపై ఎయిర్ స్ట్రయిక్స్ జరుగుతున్నాయని పీటీఐని ఉటంకిస్తూ, పలు జాతీయ మీడియా చానెళ్లలో కథనాలు రాగా, ఆర్మీ స్పందించింది.
ఈ మేరకు లెఫ్టినెంట్ జనరల్ పరమ్ జిత్ స్పందిస్తూ, దీన్ని ఓ ఫేక్ న్యూస్ గా అభివర్ణించారు. ఇండియా అటువంటి దాడులేమీ చేయలేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు ఇండియాలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుసుకున్న వైమానిక దళం దాడులు జరిపి 10 మంది పాక్ సైనికులను హతమార్చిందని గురువారం నాడు వార్తలు వచ్చాయి.