నిమ్మగడ్డ రమేశ్ ను వెంటనే తొలగించాలి: కొడాలి నాని

  • దొంగను తెచ్చి చంద్రబాబు రాజ్యాంగ పదవిలో కూర్చోబెట్టారు
  • కుక్కను తెచ్చి సింహాసనంపై కూర్చోపెట్టారు
  • నిమ్మగడ్డను తొలగిస్తేనే రాజ్యాంగ పదవిపై గౌరవం పెరుగుతుంది
ఎన్నికల నిర్వహణపై మంత్రి కొడాలి నాని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, అసభ్య పదజాలంతో దూషించారంటూ గవర్నర్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొడాలి నాని ఏమాత్రం తగ్గలేదు. నిమ్మగడ్డ రమేశ్ పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నారో లేక చంద్రబాబు చేతిలో ఉన్నారో అందరికీ తెలుసని కొడాలి నాని అన్నారు. దొంగలను తీసుకొచ్చి రాజ్యాంగ పదవిలో చంద్రబాబు కూర్చోబెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎవరిని అడిగి స్థానిక సంస్థల ఎన్నికలను నిమ్మగడ్డ ఆపారని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబుతో మాట్లాడి ఎన్నికలను నిర్వహిస్తారా? అని మండిపడ్డారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. నిమ్మగడ్డను తొలగిస్తేనే రాజ్యాంగ పదవిపై గౌరవం పెరుగుతుందని అన్నారు.


More Telugu News