ఒబామా తన పుస్తకంలో రాహుల్ ను అవమానించారంటూ కోర్టులో దావా

  • ప్రకంపనలు రేపుతున్న ఒబామా పుస్తకం
  • రాహుల్ గాంధీపై అభిప్రాయాలు వెల్లడించిన ఒబామా
  • రాహుల్ కు సొంత వ్యక్తిత్వం లేదని వ్యాఖ్యలు
రాహుల్ గాంధీకి తనదైన సొంత వ్యక్తిత్వం పూర్తిగా రూపొందలేదని, పాఠాలన్నీ చదివేసి టీచర్ మెప్పు పొందడానికి ప్రయత్నించే విద్యార్థిలా కనిపిస్తాడని, విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికి అవసరమైన జిజ్ఞాస లేనట్టుగా ఉంటాడని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పుస్తకం 'ఏ ప్రామిస్డ్ ల్యాండ్' లో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు భారత్ లో కాంగ్రెస్ వాదులను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ లోని ఓ కోర్టులో బరాక్ ఒబామాపై ఫిర్యాదు దాఖలైంది.

ఆలిండియా రూరల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జ్ఞాన్ ప్రకాశ్ శుక్లా  సివిల్ న్యాయస్థానంలో దావా వేశారు. ఒబామా తన పుస్తకంలో రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ లపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వారి అభిమానులను బాధించాయని శుక్లా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దావాపై డిసెంబరు 1న విచారణ జరగనుంది.  కాగా, ఒబామా పుస్తకాన్ని వ్యతిరేకించాలని, దేశవ్యాప్తంగా కాంగ్రెస శ్రేణులు నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ప్రకాశ్ శుక్లా పేర్కొన్నారు.


More Telugu News