సినిమాలో చేస్తే బాహుబలి... రోడ్డుపై చేస్తే అవుతారు బలి: సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆసక్తికర పోస్టు
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సామాజిక ప్రయత్నం
- మరోసారి ఆకట్టుకునే ట్వీట్
- బరువైన వస్తువులు ద్విచక్రవాహనాలపై తీసుకెళ్లొద్దని హితవు
నగర ప్రజలను సామాజిక చైతన్యం దిశగా నడిపించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం సోషల్ మీడియాలో తన వంతు ప్రయత్నాలు చేస్తుంటుంది. ఆలోచింపచేసే పోస్టులతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంటుంది. తాజాగా, ద్విచక్రవాహనాలపై భారీ వస్తువులు తీసుకువెళ్లొద్దని హితవు పలుకుతూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. సిలిండర్లు, నీళ్ల డ్రమ్ములు, గాజు వస్తువులు, నిచ్చెనలు, ఇనుపరాడ్లు, ఇతర ప్రమాదకరమైన వస్తువులను ద్విచక్రవాహనాలపై తీసుకెళ్లే ప్రయత్నం చేయొద్దని స్పష్టం చేసింది. రోడ్డుపై భద్రత చాలా ముఖ్యమని పేర్కొన్నారు. అంతేకాదు, "సినిమాలో చేస్తే బాహుబలి, రోడ్డుపై చేస్తే అవుతారు బలి" అంటూ ఆకర్షణీయ క్యాప్షన్ పెట్టారు.