హిందీలో సూర్య తాజా సినిమా రీమేక్!
- హీరో సూర్య తాజా చిత్రం 'ఆకాశం నీ హద్దురా'
- సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన సినిమా
- అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ద్వారా విడుదల
- హిందీ రీమేక్ కి ఆసక్తి చూపుతున్న షాహిద్
తమిళ కథానాయకుడు సూర్య ఎంచుకునే కథలు వైవిధ్యంతో కూడి ఉంటాయి. అందుకే, ఆయా చిత్రాలలో కొత్తదనం కనిపిస్తుంది. తాజాగా ఆయన 'ఆకాశం నీ హద్దురా' పేరిట ఓ చిత్రాన్ని చేశాడు. తెలుగమ్మాయి సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ద్వారా విడుదల చేశారు. చిత్రం సరికొత్త కథాంశంతో సాగడంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి.
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ డెక్కన్ అధినేత జీఆర్ గోపీనాథ్ ఆత్మకథ 'సింప్లీ ఫ్లయ్' ఆధారంగా దీనిని తెరకెక్కించారు. ఈ చిత్రం హీరో సూర్యకు, దర్శకురాలు సుధ కొంగరకు కూడా మంచి పేరుతెచ్చిపెట్టింది. ఈ క్రమంలో అప్పుడే ఈ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 'జెర్సీ' హిందీ రిమేక్ లో నటిస్తున్న షాహిద్ కపూర్ కి ఈ చిత్రం బాగా నచ్చడంతో హిందీ రీమేక్ లో చేయడానికి ఆసక్తిగా వున్నాడట. ఓ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ దీనిని రీమేక్ చేసే ప్రయత్నాలలో వుంది.