ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడితే కోర్టు అక్షింతలతో ఆగకపోవచ్చు: పంచాయతీ ఎన్నికలపై ఐవైఆర్ అభిప్రాయాలు
- ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ పట్టు
- ఎన్నికలు వద్దంటున్న ఏపీ ప్రభుత్వం
- మరో రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందేమోనన్న ఐవైఆర్
ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం వివాదం రూపుదాల్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కృత నిశ్చయంతో ఉండగా, ప్రభుత్వం మాత్రం కరోనా వ్యాప్తి నేపథ్యంలో ససేమిరా అంటోంది. దీనిపై మాజీ ఐఏఎస్ అధికారి, ఏపీ బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్ తమ వైఖరితో మరో రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే విధంగా ప్రవర్తిస్తున్నారని ట్వీట్ చేశారు.
రాజ్యాంగంలో పొందుపరిచిన అనుకరణ ప్రకారం ఎన్నికల నిర్వహణ అధికారం ఎస్ఈసీదేనని స్పష్టం చేశారు. ఎన్నికలు జరిపే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించడం అంటే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిది అని కాదని విశదీకరించారు. ఎన్నికల అంశంపై రాజ్యాంగంలో అంత స్పష్టంగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడితే ఈసారి కోర్టు అక్షింతలతో ఆగకపోవచ్చని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు వివేకరహితంగా ఉన్నాయని విమర్శించారు.