అజయ్ దేవగణ్ తో రకుల్ మరో సినిమా!
- బాలీవుడ్ లో కూడా రాణిస్తున్న రకుల్
- గతేడాది 'దేదే ప్యార్ దే' సినిమాతో హిట్
- అజయ్ దర్శకత్వంలో నటిస్తున్న వైనం
- కీలక పాత్రలో అమితాబ్.. టైటిల్ 'మే డే
వెండితెరపై విస్తారంగా గ్లామర్ ను ఒలికించిన కథానాయికలలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా వుంది. అందుకే, టాలీవుడ్ లో అనతికాలంలోనే అగ్రస్థాయి కథానాయికల జాబితాలో చేరిపోయింది. ఇక ఇప్పుడు ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే.. అటు బాలీవుడ్ సినిమాలలోనూ తన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలో గతేడాది అజయ్ దేవగణ్ సరసన నటించిన 'దేదే ప్యార్ దే' చిత్రం ఈ ముద్దుగుమ్మకు అక్కడ మంచి విజయాన్ని అందించింది. దీంతో మళ్లీ ఇప్పుడు అజయ్ సరసన నటించే మరో ఛాన్స్ కూడా ఆమెకు దక్కింది. అజయ్ స్వీయ దర్శకత్వంలో తన సొంత బ్యానర్ పై 'మే డే' పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో రకుల్ ని కథానాయికగా తీసుకున్నాడు. ఆమె పైలట్ పాత్రలో కనిపిస్తుందట.
ఇక ఈ చిత్రం షూటింగును వచ్చే నెల నుంచి హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో నిర్వహిస్తారు. ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. భావోద్వేగాల నడుమ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతుందని తెలుస్తోంది.