తమ కష్టాలు చెప్పిన నర్సు.. కన్నీరు కార్చిన జో బైడెన్

  • కరోనాపై పోరాడుతోన్న వైద్య సిబ్బందితో సమావేశం
  • కరోనా‌ బాధితుల బాధలు చెప్పిన నర్సు
  • తాను వారిని ఓదార్చానని వ్యాఖ్య
అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న జో బైడెన్.. కరోనాపై పోరాడుతోన్న వైద్య సిబ్బందితో మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కన్నీరు కార్చారు. వర్చువల్ పద్ధతిలో ఆయన వైద్య సిబ్బందితో మాట్లాడుతుండగా  మిన్నెసోటాకు చెందిన మేరీ టర్నర్‌ అనే నర్సు తన అనుభవాలను చెప్పింది.

కరోనా‌ బాధితులు తమ కుటుంబ సభ్యులు, ఆత్మీయుల కోసం బాధపడేవారని ఆమె జో బైడెన్ కు తెలిపింది. దీంతో తాను వారి చేతులను తన చేతుల్లోకి తీసుకుని ఓదార్చానని చెప్పింది. దీంతో బైడెన్ ‌భావోద్వాగానికి గురై కంట తడి పెట్టారు. కాగా, పీపీఈ కిట్ల కొరత ఉందని, దీంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వైద్య సిబ్బంది ఆయనకు తెలిపారు. ప్లాస్టిక్‌ సంచులను వాడుతున్నామని కొందరు వైద్య సిబ్బంది బైడెన్‌కి వివరించారు. అలాగే, వాడిన ఎన్- 95 మాస్కులనే తిరిగి వాడడంలో అవి లూజైపోయి కింద పడిపోయేవని చెప్పారు.


More Telugu News