కోర్టును ఆశ్రయించే యోచనలో ఎస్ఈసీ రమేశ్ కుమార్

  • కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎస్ కు ఎస్ఈసీ లేఖ
  • ప్రభుత్వం నుంచి రాని స్పందన
  • అధికారులు కోవిడ్ విధుల్లో ఉన్నారని సమాధానం
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ మరోసారి కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్లతో నిమ్మగడ్డ రమేశ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలనుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి సీఎస్ నీలం సాహ్నికి లేఖ రాశారు.

అయితే... అధికారులంతా కోవిడ్ విధుల్లో ఉన్నారని, ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదని బదులిస్తూ ఎస్ఈసీకి ఆమె లేఖ రాశారు. ఈ క్రమంలో ఆయన మరోసారి లేఖ రాసినా ప్రభుత్వం వైపు నుంచి స్పందన రాలేదు. దీంతో, ఈ విషయంపై కోర్టును ఆశ్రయించేందుకు ఎస్ఈసీ సిద్ధమవుతున్నారు.


More Telugu News