బాలకృష్ణ నన్నేమీ కొట్టలేదు: 'సెహరి' హీరో హర్ష్

  • ఇటీవల 'సెహరి' పోస్టర్ లాంచ్
  • అది ఓ స్నేహపూర్వక ఘటనే
  • వివాదాస్పదం చేయవద్దన్న హర్ష్ కనుమిల్లి
ఇటీవల యువ నటుడు హర్ష్ కనుమిల్లిని హీరో బాలకృష్ణ చెంపదెబ్బ కొట్టారంటూ, ఓ వీడియో వైరల్ అవుతుండగా, అటువంటిదేమీ లేదని హర్ష్ స్పష్టం చేశాడు. హర్ష్ నటించిన 'సెహరి' చిత్రం పోస్టర్ ఇటీవల విడుదల కాగా, బాలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇదే ఫంక్షన్ లో హర్ష్ ను బాలకృష్ణ కొట్టారంటూ ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండగా, యూ ట్యూబ్ వీడియో మేకర్లు, గతంలోని బాలయ్య వీడియోలను కలుపుతూ చాలా వీడియోలను తయారు చేసి వైరల్ చేస్తున్నారు.

తాజాగా ఈ ఘటనపై స్పందిన హర్ష్ కనుమిల్లి, ఈ ఘటనను పెద్దదిగా చూడవద్దని కోరారు. తనను బాలకృష్ణ చెంప మీద ఏమీ కొట్టలేదని, అది కేవలం ఓ స్నేహపూర్వక ఘటనేనని, ప్రజలు, అభిమానులు తప్పుగా అర్థం చేసుకోవద్దని అన్నాడు. అనవసరంగా ఈ విషయాన్ని వివాదం చేయవద్దని కోరాడు.


More Telugu News