కాంగ్రెస్ పాలన కాలంలో హైదరాబాద్‌లో ఎక్కువ మతకలహాలు జరిగేవి: ఐవైఆర్ కృష్ణారావు

  • బైంసా ఘర్షణ ఎప్పుడు జరిగింది? 
  • యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మత కలహాల గురించి వినడం లేదు
  • పేరుకు మాత్రమే కాంగ్రెస్ లౌకిక పార్టీ
హైదరాబాద్‌లో అభివృద్ధి కావాలా? అశాంతి కావాలా? అంటూ నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈనాడులో వచ్చిన వార్తను పోస్ట్ చేస్తూ  ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు దీనిపై తన  అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

హైదరాబాద్ మత సామరస్యానికి ఆలవాలమని, చేతగాని నేతల వల్ల కొన్ని సార్లు మత కల్లోలాలు వచ్చాయని కేసీఆర్ నిన్న అన్న విషయాలను ఆయన గుర్తు చేశారు. గత ఆరేళ్లుగా హైదరాబాద్ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని, అలాగే, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని కేసీఆర్ నిన్న చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వీటన్నింటిపై స్పందించిన ఐవైఆర్ కృష్ణారావు... ‘బైంసా ఘర్షణ ఎప్పుడు జరిగింది? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో మత కలహాలను గురించి వినడం లేదు. కాంగ్రెస్ పాలన కాలంలో హైదరాబాద్ నగరంలో ఎక్కువ మత కలహాలు జరిగేవి. పేరుకు కాంగ్రెస్ లౌకిక పార్టీ’ అని ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాగా, 2008 అక్టోబరులో భైంసాలో తీవ్రమైన మత ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే.


More Telugu News