జలాంతర్గాములను వెంటాడే పొసిడాన్ 8ఐ కూడా వచ్చేసింది!
- అమెరికా నుంచి తొలి విమానం డెలివరీ
- గోవాలోని ఐఎన్ఎస్ హన్స్ నౌకా స్థావరంలో ల్యాండింగ్
- హిందూ మహా సముద్రంపై మరింత నిఘా
భారత నౌకాదళం మరింత బలోపేతమైంది. ఇటీవలి కాలంలో వరుసగా ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్న భారత్ అమ్ముల పొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరింది. సముద్రంపై గస్తీ తిరుగుతూ, శత్రు దేశాల జలాంతర్గాములను గుర్తించి, వాటిని వెంబడించి నాశనం చేసే అత్యాధునిక పీ8ఐ (పొసిడాన్ 8ఐ) అమెరికా నుంచి ఇండియాకు చేరింది. గోవాలోని ఐఎన్ఎస్ హన్స్ నౌకా స్థావరంలో ఈ విమానం ల్యాండ్ అయింది.
ఎంతో శక్తితో కూడిన ఎలక్ట్రో ఆప్టిక్ సెన్సార్ వ్యవస్థ దీని స్పెషాలిటీ అని నౌకాదళ అధికారులు వెల్లడించారు. ఈ రాడార్ల సాయంతో సబ్ మెరైన్లు ఎక్కడున్నాయో కనిపెట్టి, వాటిపైకి ఆయుధాలను గురి తప్పకుండా వదులుతుంది. మొత్తం నాలుగు పీ8ఐ యుద్ధ విమానాలను అమెరికా అందించాల్సి వుండగా, ఇప్పుడు తొలి విమానం డెలివరీ అయింది. మరో మూడు త్వరలోనే ఇండియాకు రానున్నాయి.
కాగా, ఈ విమానాలను సంబంధించి జూలై 2016లోనే అమెరికాతో భారత్ డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం మొత్తం 1.1 బిలియన్ డాలర్లను ఇండియా చెల్లించనుంది. మిగిలిన మూడు విమానాలూ 2021లో ఇండియాకు చేరుతాయని అధికారులు వెల్లడించారు.
ముఖ్యంగా హిందూ మహా సముద్రంలో తిరుగాడుతున్న చైనా యుద్ధ నౌకలు, సబ్ మెరైన్ల కదలికలను అనుక్షణం గమనించేందుకు వీటిని వినియోగించవచ్చు. ఇప్పటికే ఇండియా వద్ద మొత్తం 8 పీ8ఐ విమానాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని లడఖ్ ప్రాంతంలో సరిహద్దుల వద్ద గస్తీ నిమిత్తమూ వాడుతున్నారు.
గంటకు 907 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ, 1,200 నాటికల్ మైళ్ల పరిధిలో నిఘా పెట్టడం వీటి ప్రత్యేకత. ఒకసారి గాల్లోకి ఎగిరితే, కనీసం నాలుగు గంటల పాటు ఎంతదూరమైనా నిఘా పెట్టగలుగుతాయి. పొసిడాన్ లోహ విహంగాలు ఇండియన్ నేవీకి అత్యంత కీలకమైన కొత్త అస్త్రాలుగా మారుతాయని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.