గోవా మాజీ స్పీకర్ మృదులా సిన్హా కన్నుమూత
- 2014-2019 మధ్య గోవా గవర్నర్‌గా మృదుల
- రచయిత్రిగా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు
- ప్రధాని, కేంద్ర హోంమంత్రి, ఇతర నేతలు సంతాపం
బీజేపీ సీనియర్ నేత, గోవా మాజీ గవర్నర్ మృదులా సిన్హా కన్నుమూశారు. ఆమె వయసు 77 సంవత్సరాలు. జనసంఘ్ రోజుల నుంచి బీజేపీతోనే ఉన్న ఆమె తన రచనలతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. 45కుపైగా పుస్తకాలు రాశారు.
బీహార్‌కు చెందిన మృదుల బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేశారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్‌పర్సన్‌గానూ సేవలు అందించారు. ఆగస్టు 2014 నుంచి అక్టోబరు 2019 వరకు గోవా గవర్నర్‌గా పనిచేశారు. ఈ నెల 27న ఆమె 78వ వసంతంలోకి ప్రవేశించనుండగా నిన్న తుదిశ్వాస విడిచారు.
మృదులా సిన్హా మృతిపై ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సహా పలువురు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. ప్రజాసేవకురాలిగా మృదుల ఎప్పటికీ గుర్తుంటారని పేర్కొన్న మోదీ.. ఆమె తన రచనల ద్వారా ప్రపంచ సాహిత్య రంగానికి సేవలు అందించారని కొనియాడారు. మృదుల తన జీవితాంతం దేశం కోసం, సమాజం, పార్టీ కోసమే పనిచేశారని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు అమిత్ షా పేర్కొన్నారు.