‘గ్రేటర్’ వార్: నామినేషన్ల దాఖలు షురూ.. తొలి రోజు 20 నామినేషన్ల దాఖలు

  • అత్యధికంగా టీఆర్ఎస్ నుంచి ఆరుగురు
  • టీడీపీ నుంచి ఐదుగురు, బీజేపీ నుంచి ఇద్దరు నామినేషన్లు
  • నామినేషన్ల దాఖలకు ఈ నెల 20 చివరి గడువు
జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి అప్పుడే రాజుకుంది. నిన్న షెడ్యూల్ విడుదల కాగా నేడు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలి రోజు 17 మంది అభ్యర్థులు 20 నామినేషన్లు దాఖలు చేశారు. నేడు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఆరుగురు, బీజేపీ నుంచి ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, టీడీపీ నుంచి ఐదుగురు, గుర్తింపు పొందిన మరో పార్టీ నుంచి ఒకరు, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.

150 వార్డులకు డిసెంబరు 1న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లకు ఈ నెల 20 ఆఖరు కాగా, 21న నామినేషన్లను పరిశీలిస్తారు. 22న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. బరిలో నిలిచే అభ్యర్థులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల దాఖలకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.


More Telugu News