'ఛత్రపతి' రీమేక్ లో బాలీవుడ్ భామ?

  • హీరోగా ప్రభాస్ రేంజ్ ని పెంచిన 'ఛత్రపతి' 
  • ఈ రీమేక్ తో బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ
  • 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వం   
  • అనన్య పాండే, సారా అలీఖాన్ లతో సంప్రదింపులు  
గతంలో హీరోగా ప్రభాస్ రేంజ్ ని ఎంతగానో పెంచిన చిత్రం 'ఛత్రపతి'. రాజమౌళి రూపొందించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఇప్పుడీ చిత్రం బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న సంగతి విదితమే. టాలీవుడ్ యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ, ఈ చిత్రాన్ని అక్కడ రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు.

'సాహో' చిత్రంతో బాలీవుడ్ లో కూడా పేరుతెచ్చుకున్న దర్శకుడు సుజీత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇందులో కథానాయికగా బాలీవుడ్ భామనే ఎంపిక చేస్తున్నారట. ఈ విషయంలో ప్రస్తుతం అనన్య పాండే, సారా అలీఖాన్ లతో ఇప్పుడు సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో ఓ క్లారిటీ వస్తుంది.


More Telugu News